AP: 2024 ఎన్నికల ఓటమి అనంతరం, మాజీ CM జగన్ రాజకీయంగా తిరిగి బలోపేతం కావడానికి కొత్త వ్యూహాలతో సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లాల పర్యటనలకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అదే సమయంలో, వరుసగా పార్టీ కేడర్‌తో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే మరో విడత పాదయాత్రపై ప్రకటన చేసిన ఆయన, ఇక పూర్తిగా తాడేపల్లి కేంద్రంగా రాజకీయ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు టాక్.