స్థానిక ఎన్నికలపై జగన్ ఫుల్ ఫోకస్.. కార్యకర్తలకు దిశానిర్దేశం

11చూసినవారు
స్థానిక ఎన్నికలపై జగన్ ఫుల్ ఫోకస్.. కార్యకర్తలకు దిశానిర్దేశం
AP: స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా తీసుకుని ప్రతి స్థానంలో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం పులివెందుల భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆయన.. అనంతరం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో చర్చించాలని కోరారు.

సంబంధిత పోస్ట్