ఎన్ని కేసులైనా, ఇబ్బందులైనా ఎదుర్కొంటాం: ఎంపీ మిథున్ రెడ్డి

4891చూసినవారు
ఎన్ని కేసులైనా, ఇబ్బందులైనా ఎదుర్కొంటాం: ఎంపీ మిథున్ రెడ్డి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వచ్చేది జగనన్న ప్రభుత్వమే అని, దానికోసం ఎన్ని కేసులైనా, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటామని ప్రకటించారు. టీడీపీ అధికారంలో ఉంటే తమపై కేసులు పెట్టడం, వేధించడం మామూలేనని, ఇవన్నీ ఒక్కరోజులో వీగిపోయే కేసులేనని కొట్టిపారేశారు. జైల్లోనూ తనను ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత ఎప్పుడూ తమ వెంటే ఉన్నారని, తమ కుటుంబానికి ఎవరికీ ఇవ్వని గుర్తింపు ఇచ్చారని పేర్కొన్నారు.  ఎన్ని ఇబ్బందులు పెట్టినా అధైర్యపడే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్