చార్టర్డ్ విమానాల వినియోగంపై ఏపీలో రాజకీయ దుమారం రేగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో విమాన ప్రయాణాలకు రాష్ట్ర ఖజానా నుంచి రూ. 222 కోట్లు ఖర్చు చేశారని, అయితే మంత్రి నారా లోకేష్ తన అధికారిక పర్యటనలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులను వినియోగించలేదని వార్తలు వస్తున్నాయి. కొడమల సురేష్ బాబు అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తులో, మంత్రి లోకేష్ తన 77 హైదరాబాద్ పర్యటనల ఖర్చును సొంత డబ్బుల నుంచే చెల్లించారని ఆయన శాఖ అధికారికంగా వెల్లడించింది.