చంద్రబాబుకు అమరావతి దోపిడీ గని: వైఎస్ జగన్

493చూసినవారు
చంద్రబాబుకు అమరావతి దోపిడీ గని: వైఎస్ జగన్
రాజధాని విషయంలో తాము ఆచరణాత్మక పరిష్కారం చూపినట్లు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తోందని, కాంట్రాక్టులతో కమీషన్లు దండుకోవడానికే అమరావతిని ప్రతిపాదిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో రూ.2 లక్షల కోట్ల భారం వేసే బదులు, మావిగన్‌లో 10 శాతం పెట్టుబడితో అద్భుతాలు చేయవచ్చని అన్నారు. కానీ చంద్రబాబు మావిగన్‌ను వద్దంటున్నారని, అమరావతి అతిపెద్ద దోపిడీ గని అని విమర్శించారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.14,000 కట్టబెడుతున్నారని, ఇది దోపిడీ కాక మరేమంటారు అని జగన్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్