3 సార్లు ఫోన్ చేసినా జగన్ నంబర్ పని చేయలేదు.. కావాలనే..!: CBI

32659చూసినవారు
3 సార్లు ఫోన్ చేసినా జగన్ నంబర్ పని చేయలేదు.. కావాలనే..!: CBI
AP: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ లండన్‌ పర్యటనపై దాఖలైన CBI పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. జగన్‌ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు 3 సార్లు ఫోన్‌ చేసినా ఆయన ఇచ్చిన నంబర్‌ పనిచేయలేదని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే పనిచేయని నంబర్‌ను ఇచ్చారని వాదించారు. జగన్‌కు ఇకపై విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు, తీర్పును అక్టోబర్‌ 28న ప్రకటించనుంది. సీబీఐ వాదనతో ఏకీభవిస్తే జగన్‌ పర్యటనలపై కోర్టు ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్