స్థానిక ఎన్నికలపై జగన్ కొత్త వ్యూహాలు

1208చూసినవారు
స్థానిక ఎన్నికలపై జగన్ కొత్త వ్యూహాలు
AP: YCP అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా ప్రజాదర్బార్‌ నిర్వహించారు. స్థానిక రాజకీయాలు, పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులకు ఆయన సూచనలు చేశారు. ఏకగ్రీవాలకు తావివ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని జగన్ పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలపై ఒత్తిళ్లు తెస్తే ధైర్యంగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్