మున్సిపల్ కౌంటింగ్ వేళ.. జగన్ సెటైరికల్ ట్వీట్

39చూసినవారు
మున్సిపల్ కౌంటింగ్ వేళ.. జగన్ సెటైరికల్ ట్వీట్
AP: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న వేళ వైసీపీ అధినేత జగన్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు టీమ్, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అభినందనలు. ప్రతిపక్షానికి అసలు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా ఎన్నికల్లో ఎలా గెలవచ్చో నిరూపించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశనూ హైజాక్ చేశారు. పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారు. బలవంతంగా బయటకు లాగేశారు. అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకున్నారు. ప్రజలు వారిని ఎన్నుకోలేదు. అందుకే ఇవి ఎన్నికలు కావు.. ఎంపికలు మాత్రమే’ అని జగన్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్