AP:
వైసీపీ అధినేత వైఎస్
జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో పెట్రోల్ కొరత, ఎండల తీవ్రత వంటి ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ,
జగన్ ప్రజల్లోకి రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆయన ఎక్కువ సమయం బెంగళూరు లేదా తాడేపల్లికే పరిమితం కావడం పార్టీ కేడర్‌లో నైరాశ్యాన్ని నింపుతోంది. అధికార కూటమి దూకుడుగా వెళ్తుంటే, ప్రతిపక్ష పార్టీగా
వైసీపీ సరైన వ్యూహంతో ముందుకు వెళ్లలేకపోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.