AP: వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు 20 నెలలు అయింది. ఇప్పటివరకు బలమైన ప్రతిపక్షంగా ప్రజా పోరాటాల విషయంలో వైసీపీ వెనకబడే ఉంది. పార్టీ అధినేత జగన్ ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో ప్రజల మధ్యకు రాలేకపోయారు. ప్రతి నెల పార్టీ నాయకులతో సమావేశాలు అవుతున్నప్పటికీ నిర్ణీత ప్రణాళికను ఆయన అమలు చేయలేకపోతున్నారు. స్ట్రాటజీ లేకుండా జగన్ అడుగులు వేస్తున్నారని పార్టీ సీనియర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల్లోకి రావడం అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడమే కాదు.. పార్టీపై సానుకూలత పెంచుకోవాల్సి అవసరాన్ని కూడా గుర్తించాలని చెబుతున్నారు.