AP: కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. వైసీపీ నేతల తీరుతో హైవేపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని పార్టీ నేతలకు పోలీసులు సూచించారు. కాగా, జగన్ కాన్వాయ్ కారణంగా పెనమలూరులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బందరు రోడ్డులో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.