AP: వైసీపీ అధినేత జగన్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. జగన్‌ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కంకిపాడు మండలంలో నెప్పల్లిలో వైసీపీ శ్రేణులు అడ్డుకోగా.. ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులను ముందుకు నెట్టుకుంటూ కార్యకర్తలు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.