నేడు గుంటూరులో జగన్ పర్యటన

46చూసినవారు
నేడు గుంటూరులో జగన్ పర్యటన
AP: వైసీపీ అధినేత జగన్ బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉ.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. రోడ్డు మార్గాన 11 గంటలకు గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు. అయితే, గుంటూరు పరిధిలో సెక్షన్ 30 అమల్లో ఉందని, రాజకీయ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడం నిషేధమని పోలీసు శాఖ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్