స్థానిక ఎన్నికలపై జగన్ సీరియస్.. ముఖాముఖీ భేటీలు షురూ

56చూసినవారు
స్థానిక ఎన్నికలపై జగన్ సీరియస్.. ముఖాముఖీ భేటీలు షురూ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలతో వరుసగా వన్‌ టు వన్‌ భేటీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి మేయర్‌, జెడ్పీ చైర్మన్‌ వరకు వివిధ స్థానాలకు ఆశావహుల బలాబలాలను అంచనా వేస్తున్నట్లు సమాచారం. ప్రతి స్థానానికి ముగ్గురు ఆశావహులతో షార్ట్‌లిస్ట్‌ సిద్ధం చేయాలని పార్టీ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్