మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మరణం పట్ల YCP అధినేత వైఎస్
జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వెంకటరెడ్డి సుదీర్ఘకాలం పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రమించారని కొనియాడారు. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. గాదె వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.