వైఎస్ చనిపోయిన సమయంలో జగన్ ఎక్కడ ఉన్నారో చెప్పాలి: అచ్చెన్న

0చూసినవారు
AP: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. "వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో జగన్ ఎక్కడ ఉన్నారో చెప్పాలి?. వైఎస్ ఆచూకీ తెలియక అందరూ ఆందోళన చెందుతుంటే సీఎం పదవి కోసం పాకులాడుతారా?. ఏం జరిగిందో నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం జగన్ సంతకాల సేకరణ చేస్తారా?" అని మంత్రి ప్రశ్నించారు. ఈ అంశంపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్