AP: గత YCP ప్రభుత్వ ఐదేళ్లకాలంలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు తెరవాలని మంత్రి పార్థసారథి డిమాండ్ చేశారు. 2019లో సంపూర్ణ మద్యపానం నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన YCP, ఆ తర్వాత మద్యం విధానంలో ఎలాంటి మార్పులు చేసిందో అందరికీ తెలుసన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన మద్యం బ్రాండ్‌ల కారణంగా 30 వేల మంది మహిళల తాళిబొట్లు తెగిపోయాయని, మద్యం కుంభకోణానికి జగన్‌మోహన్ రెడ్డే కారణమని ఆరోపించారు.