AP: గన్నవరం విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డిని ఒక చిన్నారి తల్లిదండ్రులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం తమ బిడ్డ న్యూరో సర్జరీకి సహాయపడిందని, అందుకే
జగన్ ను కలవడానికి వచ్చామని పాప తండ్రి తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారితో
జగన్ సెల్ఫీ దిగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.