AP: వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయింపుపై జగన్ షాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ విధేయుడైన ఉన్న ఆళ్లకు 2024 ఎన్నికల్లో మంగళగిరి టికెట్ దక్కలేదు. మనస్తాపంతో కాంగ్రెస్‌లో చేరినా, చివరికి జగన్ గూటికి ఆయన వచ్చేశారు. ఇటీవల సత్తెనపల్లి బాధ్యతలు ఇవ్వాలని కోరగా జగన్ నిరాకరించినట్లు టాక్. దీంతో వైసీపీతో పాటు రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారనే చర్చ సాగుతోంది.