AP: గుడివాడలో జరిగిన పార్టీ ర్యాలీలో
వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీది ‘పచ్చ గొడ్డలి పార్టీ’ అని ధ్వజమెత్తారు. 2029 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్‌కు పరశురాముడి గొడ్డలిని అందిస్తారని, ఆయన టీడీపీకి రాజకీయ సమాధి కట్టడం ఖాయమని హెచ్చరించారు.