ప్రజల కోసం జగన్‌ ఎవరినైనా ప్రశ్నిస్తారు: కొడాలి నాని

37చూసినవారు
ప్రజల కోసం జగన్‌ ఎవరినైనా ప్రశ్నిస్తారు: కొడాలి నాని
YCP నేత, మాజీ మంత్రి కొడాలి నాని బుధవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ సమావేశంలో వైఎస్‌ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని, చంద్రబాబు రెండేళ్ల పాలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా చూడాలని, చంద్రబాబు చేసిన వెన్నుపోటు రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని అన్నారు. లోకేష్ ఉన్న ఒక్క శాఖను నడపలేక పోతున్నారని, జగన్‌తో చంద్రబాబు చర్చకు రావాలని సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్