AP: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ఏటా సంక్రాంతి పర్వదినాల్లో జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. మంగళవారం మలికిపురం గ్రామంలో సినీ చిత్రీకరణ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి స్థానికులు వినతి పత్రం అందించారు. 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రభల తీర్థానికి లక్షల మంది భక్తులు వస్తారని, దీనిని రాష్ట్ర పండగగా గుర్తించాలని కోరారు.