జైలర్ 2.. మలయాళ మార్కెట్‌లో భారీ పోటీ

8765చూసినవారు
జైలర్ 2.. మలయాళ మార్కెట్‌లో భారీ పోటీ
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ 'జైలర్' సినిమా సీక్వెల్ 'జైలర్ 2' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ, కేరళలో థియేట్రికల్ హక్కుల కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థల మధ్య పోటీ మొదలైంది. మొదటి భాగంలో మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో కనిపించడం అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'జైలర్ 2'లో కూడా ఆయన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దక్షిణాది మార్కెట్‌లో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉండటంతో పంపిణీ హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొంది.

సంబంధిత పోస్ట్