టీవీకే చీఫ్ విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' మే 8న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ వివాదాలు, కోర్టు విచారణలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల సినిమా ఒరిజినల్ ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ అవ్వడంతో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.