రెబల్ అభ్యర్థిపై జనసేన వేటు.. కనకల రామారావు సస్పెండ్!

11చూసినవారు
రెబల్ అభ్యర్థిపై జనసేన వేటు.. కనకల రామారావు సస్పెండ్!
AP: విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ జడ్పీటీసీ ఎన్నికలలో జనసేన అధిష్టానం తుమ్మి లక్ష్మీ రాజ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ, ఆ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ కనకల రామారావు రెబల్ అభ్యర్థిగా పోటీలో కొనసాగుతున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కనకల రామారావుపై జనసేన పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకరరావు అధికారికంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్