AP: మాజీ మంత్రి, వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కు భారీ షాక్ తగిలింది. ఆయనపై ఏసీబీ డీజీకి జనసేన ఫిర్యాదు చేసింది. వెల్లంపల్లి అక్రమార్జనపై విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెల్లంపల్లి అవినీతికి పాల్పడ్డారని.. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఏసీబీకి జనసేన నేతలు అందజేశారు. ఈ ఘటన వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.