ఉత్తరాంధ్రలో ఎస్టీ అసెంబ్లీ సీట్లు అధికంగా ఉన్నందున అరకు ఎంపీ సీటును
జనసేన లక్ష్యంగా చేసుకుంది. 2024 ఎన్నికల్లో
వైసీపీ గెలిచినప్పటికీ, ఈసారి అరకు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని
జనసేన నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకు, పాడేరు, పాలకొండ, పార్వతీపురం ప్రాంతాల్లో పర్యటించి, గిరిజన ప్రాంతాలకు నిధులు కేటాయించి, రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. గిరిజన యువత, మహిళలతో సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ పరిణామాలతో 2029 ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తున్నారు.