స్థానిక ఎన్నికల్లో జనసేన పక్కా ప్లాన్.. 30% సీట్లలో పోటీకి సిద్ధం?

8942చూసినవారు
స్థానిక ఎన్నికల్లో జనసేన పక్కా ప్లాన్.. 30% సీట్లలో పోటీకి సిద్ధం?
AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలం ఉన్న చోట్ల పోటీకి సిద్ధమవుతోంది. పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీలో కూటమి బలంగా ఉండాలని, జనసేన ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ముందుకు సాగుతామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కార్యకర్తలకు అవకాశంగా చూస్తూ, 30% సీట్లలో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. పిఠాపురంలో కేడర్ వేడిని పెంచాలని, నియోజకవర్గాన్ని మోడల్ అసెంబ్లీగా అభివృద్ధి చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్