AP: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం జాతీయ స్థాయికి చేరింది. బాధితురాలు తన న్యాయవాది ఆజాద్‌తో కలిసి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను వేధిస్తున్నారని, అబార్షన్ చేయించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పిటిషన్ స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక కోరే అవకాశం ఉంది.