కారు పైకి ఎక్కి జనసేన ఎమ్మెల్యే కామెంట్స్.. భగ్గుమన్న వర్గపోరు

0చూసినవారు
AP: పోలవరం జనసేనలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. నిన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారు పైకి ఎక్కి నియోజకవర్గంలో దొరల పాలన పోవాలనడం చర్చనీయాంశంగా మారింది. చిర్రి బాలరాజుకు, ఆయనకు టికెట్ ఇప్పించిన కాపు నేత కరాటం రాంబాబు వర్గానికి మధ్య పలు విషయాల్లో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దాంతో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాంబాబు వర్గం సొంతంగా పార్టీ కార్యక్రమాలు చేపడుతుండగా.. స్థానిక ఎమ్మెల్యేగా తనకు గౌరవం ఇవ్వట్లేదని చిర్రి బాలరాజు మండిపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్