AP: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం
జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాదరక్షలు ధరించి చండీ దీక్షలో ఉండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. బుధవారం రాజానగరం మండలం దివాన్ చెరువులో జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా కనిపించారు. ఈ ఘటనపై నెటిజన్లు, విమర్శకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.