పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై
జనసేన పార్టీ ఎంపీలకు పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో దిశానిర్దేశం చేయనున్నారు. కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్‌ను శుక్రవారం ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.