AP: ప్రకాశం జిల్లాలో
జనసేన పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత టీమ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి దూరంగా ఉన్న సీనియర్ నేతలు మానుగుంట మహీధర్ రెడ్డి, శిద్దా రాఘవరావు, ఆమంచి కృష్ణమోహన్, మద్దిశెట్టి వేణుగోపాల్‌లతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. వీరిలో శిద్దా రాఘవరావు జనసేనలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బాలినేని ఈ నలుగురినీ జనసేనలోకి తీసుకురావడం ద్వారా పార్టీలో తన పరపతిని పెంచుకోవాలని చూస్తున్నారని సమాచారం.