AP: పవన్ కళ్యాణ్ చేసిన 'కోనసీమ దిష్టి' వ్యాఖ్యలపై జనసేన పార్టీ స్పందించింది. రైతులతో సంభాషణలో భాగంగా చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీయవద్దని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ మంత్రులు పవన్ వ్యాఖ్యలను కించపరిచేవిగా అభివర్ణించి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. జనసేన పార్టీ ఈ వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపిస్తోంది.