ఏపీ రాజకీయాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నెల్లూరులో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్‌లో రేషన్ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని చేసిన సంచలన వ్యాఖ్యలు టీడీపీ-జనసేన నేతల మధ్య వివాదానికి దారి తీశాయి. ఈ పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. హైకమాండ్ జోక్యం చేసుకుని, మంత్రి నారాయణను పిలిపించి, నెల్లూరు టీడీపీ నేతలను సైలెంట్‌గా ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు.