AP:
వైసీపీ ఈ మధ్యకాలంలో కాపుల మద్దతు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాపులను
జనసేన నుంచి దూరం చేసే ఎత్తుగడలకు దిగుతోంది. అయితే
జనసేన కూడా వీటిని అంతే ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చినా కాపు నేతను సీఎం చేయలేరని,
జనసేన అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని ఆ పార్టీ కాపు నేతలు చెబుతున్నారు.
వైసీపీ అధిష్టానం కాపు నేతను సీఎం చేయగలదా? అని
జనసేన నేతలు సవాల్ విసురుతున్నారు. ఈ అంశంపైనే
జనసేన కొత్త స్ట్రాటజీని అమలు చేయనుందని సమాచారం.