జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (NICT) శాస్త్రవేత్తలు ఇంటర్నెట్ స్పీడ్‌లో సెకనుకు 1.02 పీటాబిట్ల ప్రపంచ రికార్డును సృష్టించారు. మే 2025లో చేపట్టిన ఈ ప్రయోగంలో, 19-కోర్ ఆప్టికల్ ఫైబర్ సాంకేతికతను ఉపయోగించి 1,808 కిలోమీటర్ల దూరంలో ఈ వేగాన్ని సాధించారు. ఈ వేగంతో ప్రపంచంలోని మొత్తం సినిమాలను ఒక్క సెకనులో డౌన్‌లోడ్ చేయవచ్చు. ఈ సాంకేతికత భవిష్యత్తులో స్మార్ట్ సిటీలు, భారీ డేటా సెంటర్లు, కృత్రిమ మేధస్సు వ్యవస్థలకు కీలకం కానుంది.