జపాన్‌లోని ఓవాకుడాని లోయలో 3000 ఏళ్ల నాటి అగ్నిపర్వత ప్రాంతంలోని వేడి నీటి కొలనులలో ఉడికించే గుడ్లు నల్లగా మారతాయి. వీటిని 'కురో-తమాగో' లేదా 'జపనీస్ బ్లాక్ ఎగ్' అంటారు. అధిక సల్ఫర్ వల్ల గుడ్డు పెంకు నల్లబడుతుంది. స్థానికుల నమ్మకం ప్రకారం, ఈ గుడ్లు తింటే ఆయుష్షు 7-8 సంవత్సరాలు పెరుగుతుంది. ఈ వింతను చూడటానికి, రుచి చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. గుడ్లకు సల్ఫర్ వాసనతో పాటు ప్రత్యేక రుచి ఉంటుంది.