జపాన్‌లో పండే అరుదైన, అత్యంత ఖరీదైన మామిడి పండ్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పండుతున్నాయి. మార్కెట్లో కిలో రూ.2.70 లక్షల వరకు ధర పలికే ఈ మామిడిని ఏపీలోని ఓ వ్యాపారవేత్త విజయవంతంగా పండిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా ఈ అరుదైన మామిడి చెట్టును తన ఇంట్లో పెంచుతున్నారు. ఈ మామిడి ప్రత్యేకత, దాని అధిక ధరకు కారణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.