ఎర్రచందనంపై డాక్యుమెంటరీని తొలగించిన జావా డిస్కవర్

24చూసినవారు
ఎర్రచందనంపై డాక్యుమెంటరీని తొలగించిన జావా డిస్కవర్
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కథనం ప్రసారం చేసినందుకు జావా డిస్కవర్ ఛానెల్ తన డాక్యుమెంటరీని తొలగించింది. సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి రాసిన 'బ్లడ్ శాండల్స్' పుస్తకం ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో, జగన్మోహన్ రెడ్డి ఫోటోను తప్పుగా చూపించారని, పుస్తకంలో లేని అంశాలను ప్రస్తావించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు పంపింది. దీంతో ఛానెల్ డాక్యుమెంటరీని తొలగించింది.