AP: టీడీపీకి భారీ షాక్ తగలనుంది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి వైసీపీలో చేరతారనే ప్రచారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. గతంలో టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న జేసీ పవన్ రెడ్డి, ఇప్పుడు అనంతపురం జిల్లాలో వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డితో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై జేసీ ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.