AP: ఒంగోలులోని ఓ స్థలం విషయంలో టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించారని సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఒంగోలులోని 148 సర్వే నంబరులోని స్థలం విషయంలో తన మనుషులు వస్తారని, వారికి ఆ స్థలం అప్పగించాలని బెదిరించారని ఆయన తెలిపారు. బెదిరింపులతో పాటు అసభ్య పదజాలాన్ని ఉపయోగించారని సూర్యప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.