తాడిపత్రి పీఎస్ వద్ద స్నానం చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన

17చూసినవారు
AP : అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హైడ్రామా సృష్టించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ, తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద నడిరోడ్డుపై స్నానం చేసి నిరసన తెలిపారు. పెద్దారెడ్డి దౌర్జన్యం చేశారని, ఆయనపై కేసులు నమోదు చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో ఫిర్యాదులు చేయించారు. అయితే, హైకోర్టు ఆదేశాల మేరకు పెద్దారెడ్డి స్వేచ్ఛగా పర్యటించవచ్చని తెలిపింది. అయినప్పటికీ, జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిడితో పోలీసులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్