పదవ స్థానాన్ని బట్టి ఉద్యోగ భవిష్యత్తును అంచనా వేయవచ్చని జ్యోతిషశాస్త్రం వివరిస్తోంది. గ్రహ సంచారం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి రాబోయే రెండు నెలల్లో ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఈ రాశుల వారికి ఆశించిన
ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయని, కొందరికి విదేశీ
ఉద్యోగాలు, మరికొందరికి సొంత ఊర్లోనే
ఉద్యోగాలు దొరికే సూచనలున్నాయని జ్యోతిష్యం చెబుతోంది. పదోన్నతులు, ఉన్నత స్థానాలు, ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని అంచనా.