ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. APSPDCL డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 135 ఖాళీలున్నాయి, వీటిలో ఎలక్ట్రికల్ 125, సివిల్ 6, టెలికాం 4 పోస్టులు ఉన్నాయి. బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైన 18-42 ఏళ్ల మధ్య వయస్సు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.