AP: నకిలీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. సోమవారం ఆయన కుటుంబ సమేతంగా విజయవాడ దుర్గ గుడి వద్ద చేతిలో హారతి వెలిగించుకున్నారు. ‘కల్తీ మద్యం పేరుతో నా హృదయాన్ని గాయపరిచారు. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అమ్మవారి సాక్షిగా చెబుతున్నాను. నేను తప్పు చేయలేదు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికే చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు. లైవ్ డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం’ అని జోగి రమేశ్ అన్నారు.