రాత్రి పూట అన్నం లేదా చపాతీలకు బదులుగా జొన్న రొట్టెలు లేదా రాగి రొట్టెలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. జొన్న రొట్టెల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభమై, నిద్రకు భంగం కలగదు. రాగి రొట్టెలు రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలపరుస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ ఉన్నవారికి ఇవి మంచి ఎంపిక. వీటితో పాటు కూరగాయల కూరలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.