ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ) జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్లాంట్ బ్రీడింగ్/ జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్/ జెనెటిక్ రిసోర్సెస్/ జెనెటిక్స్/ ప్లాంట్ బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీతో రెండేండ్ల అనుభవం, 35 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 16న ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది. పూర్తి వివరాలకు pjtau.edu.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.