నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ (NIMHANS) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 04 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎం.ఫిల్ తోపాటు రెండేండ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 10. అదే రోజు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.nimhans.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.