డిప్యూటీ సీఎంకో న్యాయం?.. నాకో న్యాయమా? రఘురామ

14చూసినవారు
డిప్యూటీ సీఎంకో న్యాయం?.. నాకో న్యాయమా? రఘురామ
AP: తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లాయర్ జడ శ్రవణ్‌కుమార్‌పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో స్పందించిన విధంగానే.. తనపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. రాజ్యాంగంలోని రిజర్వేషన్ల గురించి మాట్లాడితే నాలుక కోస్తా, సమాధి కడతా అని బెదిరించిన వ్యక్తిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్